తేతలి - 1లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

84చూసినవారు
తేతలి - 1లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం
తణుకు మండలం తేతలి - 1 గ్రామంలో బుధవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సాయి భవాని ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం పలువురికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ ఓ ఉదయలక్ష్మి, డిఈఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పీ. జ్యోతి రత్నశ్రీ, ఎంపీ హెచ్ఏ రామ్ కుమార్, ఏఎన్ఎం సరోజినీ, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్