జంగారెడ్డిగూడెంలో క్యాన్సర్ పరీక్షలపై అవగాహన ర్యాలీ

54చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సంయుక్త ర్యాలీ చేపట్టారు. క్యాన్సర్ పరీక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు. పట్టణ పురవీధులలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్