షార్ట్ సర్క్యూట్ వల్ల కారులో మంటలు చేలరేగిన సంఘటన ఆదివారం రాత్రి కృష్ణా జిల్లాలో వెలుగు చూచింది. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కానుమోలు గ్రామం వద్ద కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తండ్రి కొడుకులు కారులో ముందస్తుగా మంటలను గమనించి కారు దిగిపోయారు. సమాచారం తెలుసుకున్న హనుమాన్ జంక్షన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.