మళ్ళీ మ‌ళ్లీ ఫిర్యాదులు రాకుండా త‌గిన ప‌రిష్కారం చూపాలి

57చూసినవారు
మళ్ళీ మ‌ళ్లీ ఫిర్యాదులు రాకుండా త‌గిన ప‌రిష్కారం చూపాలి
మ‌ళ్లీ మ‌ళ్లీ ఫిర్యాదులు రాకుండా ప్ర‌జ‌లు స‌మ‌ర్పించే విన‌తుల‌కు నాణ్య‌మైన రీతిలో ప‌రిష్కారం చూపాల‌ని జిల్లా కలెక్ట‌ర్ చదలవాడ నాగరాణి అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం స్థానిక క‌లెక్ట‌రేట్ మీకోసం సమావేశ మందిరం నందు నిర్వ‌హించిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్ర‌జ‌ల నుంచి ఆమె విన‌తులను స్వీక‌రించారు. ముందుగా గ‌త వారం ప్ర‌జ‌లు స‌మ‌ర్పించిన విన‌తుల‌పై అధికారులు తీసుకున్న చ‌ర్య‌ల‌పై స‌మీక్షించారు.

సంబంధిత పోస్ట్