కొల్లేరు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి

58చూసినవారు
కొల్లేరు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి
కొల్లేరు సరస్సు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహాయ, సహకారాలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో కొల్లేరు బఫర్ జోన్ నిర్ధారణకు సంబంధించిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని, దీన్ని కాపాడటంలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్