మల్లవరంలో 25 రోజులపాటు రీ సర్వే

72చూసినవారు
మల్లవరంలో 25 రోజులపాటు రీ సర్వే
నరసాపురం మండలం మల్లవరం గ్రామంలో 25 రోజుల పాటు భూ రీసర్వే నిర్వహిస్తామని తహసీల్దార్ రాజరాజేశ్వరి సోమవారం తెలిపారు. గ్రామంలో 2వేల ఎకరాలు సాగులో ఉందన్నారు. రోజూ 25 ఎకరాల చొప్పున రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తారని చెప్పారు. భూమి ఆన్‌లైన్ వివరాలు, సరిహద్దులు తదితర సమస్యలను ఈ రీసర్వే దృష్టికి తీసుకొస్తే తక్షణం పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు. రైతులు భూ రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.