నరసాపురం స్టేషన్ పేటలో ఫెయిత్ చర్చ్ నిర్వాహకుడు వై.రూబెన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సమక్షంలో నియోజకవర్గంలోని ఐదు పాస్టర్ల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో.. ఫెయిత్ చర్చ్ కంపౌండ్ లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు సుదీర్ఘంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.