రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదగా శుక్రవారం అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు నూజివీడు పట్టణంలోని ఆర్ఆర్ పేటలో గతంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో తిరిగి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి క్యాంప్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లుగా తెలిపారు.