ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ మీడియాపై దాడులకు తెగబడుతున్నారని తేదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గంగిరెడ్ల మేఘాలాదేవి ఆరోపించారు. గురువారం ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేఘాలాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో హింస పరాకాష్టకు చేరిందన్నారు. వ్యూహాత్మకంగా ఒక్కో వర్గాన్ని టార్గెట్ చేసి భయాందోళనలకు గురి చేస్తుంది అన్నారు.