వెలేరుపాడు మండలం ముంపు ప్రభావిత ప్రాంతాలలో బుధవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఇందులో భాగంగా కట్కూరు, కోయిదా పంచాయతీలలో పేరంటాలపల్లి, టేకుపల్లి గ్రామాల్లో లాంచి ప్రయాణం ద్వారా నేరుగా ముంపు గ్రామాలను సందర్శించారు. బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, మంచినూనె నిత్యావసర సరుకులను ప్రజలకు సరఫరా చేశారు. ప్రజలెవ్వరు భయబ్రాంతులకు గురవ్వొద్దని మీకు అండగా మేము ఉంటామన్నారు.