శ్రీసత్యసాయి మంచి నీటి ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులకు జీతాలు ప్రతినెల సక్రమంగా అందేటట్లు కృషి చేస్తానని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు.
ఈ మేరకు గురువారం శ్రీసత్యసాయి మంచి నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు గత ఏడు నెలలుగా తమకు రావలసిన జీతాలు గూర్చి ఎమ్మెల్యే చిర్రి బాలరాజును ఆయన ఇంటి వద్ద కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.