ఉభయ గోదావరి జిల్లాల్లో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు శుక్రవారానికి 5 కోట్ల కేజీలు పూర్తయ్యాయి. అధికారికంగా బోర్డు సుమారు 50 మిలియన్ కేజీలకే అనుమతి ఇచ్చింది. సెప్టెంబరు రెండో వారం నాటికి వేలం పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది పొగాకు ధర కేజీకి గరిష్ఠంగా రూ. 400 పలికింది. సరాసరి రూ. 332. 97 చొప్పున లభించింది. మార్చిలో వేలం ప్రారంభ సమయంలో కేజీ రూ. 240గా ఉంది.