తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.' లడ్డూ వివాదంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చని గతంలో టీటీడీ ఈవో చెప్పారు. చంద్రబాబు బెదిరించిన తర్వాత మాట మార్చారు. 2014-19 మధ్య టీటీడీలో నందిని నెయ్యి ఎందుకు వాడలేదు? కలుషితమైంది నెయ్యి కాదు.. చంద్రబాబు మానసిక స్థితి' అని మండిపడ్డారు.