ఏపీలో కొత్త యాప్‌ను ప్రభుత్వం తీసుకురానుంది. రైతులతో పాటు వివిధ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నారు. ప్రొడక్ట్స్ అమ్మకం, కొనుగోలు కోసం ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామార్స్ పేరతో ప్రత్యేక వ్వవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి పాలసీ తయారీ కోసం ఒక కమిటీని, పర్యవేక్షణ కోసం మరో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.