ఏపీలో డ్రోన్ సేవలను ప్రయోగాత్మకంగా అధికారులు పరీక్షించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్‌సీ వరకు డ్రోన్‌ను పంపించారు. ఓ మహిళా రోగి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి తిరిగొచ్చింది. ఎయిమ్స్ నుంచి ఈ పీహెచ్‌సీ దాదాపు 12 కి.మీ దూరంలో ఉంది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నారు.