భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి కూడా ఒకటి. ఈ పండుగ రోజు విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. అయితే ఇది ఒక్క భారత్లో మాత్రమే కాదు.. నేపాల్, బాలి, సింగపూర్, అమెరికా, మలేషియా, ఫిజీ, మారిషస్, శ్రీలంక వంటి దేశాలు సెలవుదినంగా పాటిస్తాయి.