మన పూర్వికులు ప్రతి దానికీ రాగి పాత్రలనే ఉపయోగించేవారు. అందులోని సకల పోషకాలు తీసుకునే ఆహారంలో చేరి శరీరంలోని ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడేవి. రాగి బాటిల్‌లోని నీటిని తాగడం ద్వారా, శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. ఇది రక్తహీనత ప్రభావాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రాగి బాటిల్‌లో రోజుకు 2 గ్లాసుల కంటే ఎక్కువ నీటిని తాగకూడదు.