బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడుకి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం అదే గ్రామానికి చెందిన కాళీ కృష్ణ అనే యువకుడు బాణ సంచా తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. కాళీ కృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్యను కాకినాడ జీజీహెచ్ తరలించారు. మృతుడి తల్లిదండ్రులకు గాయాలవ్వడంతో మండపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు.