ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి రోజా కీలక సూచనలు చేశారు. హీరో ప్రభాస్, అల్లు అర్జున్ను ట్రోల్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్, జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అన్నారు. అల్లు అర్జున్, ఆయన కుటుంబంపై నీచంగా పోస్టులు పెడుతున్నారని, వాటిని ఆపివేయించాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించాలని అన్నారు.