ఏపీలో ఎన్నికలు లాంఛనమేనని, కూటమే గెలుస్తుందని చంద్రబాబు తెలిపారు. "కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తాం. రాష్ట్రానికి ఇది చాలా కీలక సమయం.. ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చింది. చట్టబద్ధంగా కులగణన చేపడతాం. బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటా. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతాం." అని చంద్రబాబు తెలిపారు.