ఢిల్లీలోని వ్యాపారులను పలువురు గ్యాంగ్స్టర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బడా వ్యాపారులే లక్ష్యంగా చేసుకొని తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దాదాపు 160 థ్రెట్ కాల్స్ వచ్చాయని అంటే దాదాపు 300 రోజుల్లోనే 160 వరకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్,హిమాన్షు భౌ వంటి గ్యాంగ్లే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.