రాత్రంతా నానబెట్టిన బాదం పప్పుల్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. బాదం నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. ఇది మనం ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వులు కరిగేందుకు దోహదపడుతుంది. బాదంపప్పులో ఉండే విటమిన్-ఇ స్వల్పకాల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా, అల్జీమర్స్ వంటి తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.