ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ఆగ్రాకు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి 9:45 గంటలకు ఛలేసర్ వద్ద ఓ గుర్తుతెలియని జంతువును ఢీకొంది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, రైలు ముందు భాగం విరిగిపోయింది. రైలును దాదాపు 30 నిమిషాల పాటు ట్రాక్‌పై ఆపేశారు. రైల్వే సాంకేతిక సిబ్బంది రైలును తనిఖీ చేసిన అనంతరం తిరిగి బయలుదేరింది.