పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల చినవేంకన్న దివ్య క్షేత్రంలో ఈనెల 9న గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ మెట్లపై హారతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆలయ ఇన్‌ఛార్జి ఈవో త్రినాథరావు వెల్లడించారు. అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తామని తెలిపారు.