భారీ కొండచిలువను మేకల కాపర్లు హతమార్చారు. ఈ ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో జిరిగింది. కాండ్రేగులతోని పెద్దకొండపై మేకల్ని తినేందుకు భారీ కొండచిలువ వచ్చింది. మేకలు అరవడంతో కాపరులు ఏమైందో చూసేందుకు అక్కడికి వెళ్లారు. భారీ ఆకారంలో ఉన్న కొండచిలువ వారికి కనిపించింది. దాంతో వారు కొండచిలువపై దాడి చేసి హతమార్చారు.