శ్రీశైలం మహా పుణ్య క్షేత్రంలో గురువారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వైభవంగా స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్వర్ణ రథానికి వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.