భారత్ సహా 14 దేశాల విదేశీ విద్యార్థులకు కెనడా షాకిచ్చింది. విద్యార్థులకు వేగంగా స్టడీ వీసా ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(SDS) విధానాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాటు నైజీరియా విద్యార్థులకు వేగంగా వీసా కల్పించే నైజీరియా స్టూడెంట్ ఎక్స్ప్రెస్(NSE) విధానాన్ని కూడా ఆపేసింది.