AP: రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్. 2024–25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల అయ్యాయి. రూ.40.22 కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్‌కు రూ.37.88 కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.