ఏపీ ప్రజలకు విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాగూర్ రామ్ శుభవార్త చెప్పారు. 2025-26 ఏడాదికి ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం ఉండదని తెలిపారు. రూ.14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా రాయితీలన్నీ కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో కరెంటు ఛార్జీలు పెంచొద్దని ప్రజా సంఘాలు కోరినట్లు పేర్కొన్నారు.