ఏపీలో ఎన్నికల హామీల అమలు పైన చర్చ మొదలైంది. కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పైన అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు.