తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు."కూటమి పాలనలో మద్యం, మాసం తిరుమలలో పట్టుబడుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడింది. అంటే టీటీడీ వైఫల్యం మరోసారి విఫలమైంది. మారణాయుధాలుతో వచ్చినా పట్టించుకోలేని పరిస్థితి తీసుకువచ్చారు. టీడీపీ నాయకుల సేవలో టీటీడీ ఛైర్మన్ పనిచేస్తున్నారు. భక్తులను పట్టించుకోవడం లేదు" అని భూమన సంచలన ఆరోపణలు చేశారు.