టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్‌కు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్‌ను ఎంపిక చేసి సిరాజ్‌ను పక్కన పెట్టారు. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అంతగా రాణించకపోవడం, అలాగే ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో సిరాజ్‌ను ఎంపిక చేయలేదు.