హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందుంతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 200 మీటర్ల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.