గ్రామ పంచాయతీలను గాడిలో పెడుతున్నాం: ఎమ్మెల్యే

58చూసినవారు
గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఒరవడిని తీసుకురానుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామపంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం పంచాయతీలను గాడిలో పెడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్