మేడికొండూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ ఆకస్మికంగా పర్యటించారు. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరు శాతంతో పాటు ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. మౌలిక వసతుల కల్పన, ఇతర సమస్యల పై ఆరాతీశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో నాణ్యత చూసి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పలువురు చిన్నారుల్లో ప్రతిభను కలెక్టర్ పరీక్షించారు.