రూ.60 దొంగిలించిన ఓ వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. శివకాశికి చెందిన పన్నీర్ సెల్వం (55) అనే వ్యక్తి 1997లో రూ.60 దొంగిలించి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అయితే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసును గుర్తించేందుకు మదురై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జనాభా సర్వేయర్ల ముసుగులో వెళ్లిన పోలీసులు అతడి ఆధారాల ద్వారా గుర్తించి అరెస్ట్ చేశారు.