మనం సంపాదించిన డబ్బును పొదుపు చేసేందుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్‌లలో RD(రికరింగ్ డిపాజిట్) ఒకటి. ఈ స్కీంలో పెట్టుబడి పెట్టి 10 ఏళ్లలో రూ.17 లక్షలు పొందొచ్చు. అదెలాగంటే.. ఈ స్కీమ్ కాలపరిమితి సాధారణంగా 5 ఏళ్లు ఉంటుంది. ఇందులో రోజుకు రూ.333 ప్రకారం కడితే నెలకు రూ.10వేలు అవుతుంది. ఇలా ఐదేళ్లు కడితే వడ్డీతో కలిపి రూ.7.13 లక్షలు వస్తుంది. ఈ మొత్తాన్ని అలాగే మరో ఐదేళ్లు పెడితే రూ.17.08 లక్షలు చేతికొస్తాయి.