నాసు వ్యాధికి వ్యాక్సిన్ వేయించాలి

59చూసినవారు
కొరిశపాడు మండలంలోని గొర్రెలు, మేకల పశుపోషకులు నాసు వ్యాధికి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ వెంకట్రావు బుధవారం తెలియజేశారు. ఈనెల 15వ తేదీ వరకు వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుందని ఆయన చెప్పారు. తమ సిబ్బంది నేరుగా రైతుల ఇళ్ల వద్దకు వచ్చి జీవాలకు వ్యాక్సిన్ వేస్తారని డాక్టర్ వెంకట్రావు తెలిపారు. జీవాలకు జ్వరం లక్షణాలు వస్తే వెంటనే ప్రభుత్వ డాక్టర్ ను సంప్రదించాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్