కొరిశపాడు మండలం, మేదరమెట్ల ప్రభుత్వ వైద్యశాల నందు వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం మండల ఎంపీపీ ప్రసన్న కుమారి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. సందర్భంగా వైద్యశాలకు సంబంధించి వివిధ ఖర్చులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్లు చిట్టిబాబు, నిఖిల రెడ్డి, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, మేదరమెట్ల సర్పంచ్ యలిసమ్మ, గుడిపాడు గ్రామ సర్పంచ్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.