Apr 24, 2025, 07:04 IST/
'మూడేళ్ల చిన్నారి ఉందన్నా కనికరించలేదు’
Apr 24, 2025, 07:04 IST
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తోంది. ఉగ్రవాదులు ఎంత దారుణంగా ప్రవర్తించారనే విషయాలను ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదుల దాడి నుంచి తప్పించుకోవడానికి ఓ గుడారంలో దాక్కున్నామని మృతుడు భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ తెలిపారు. అందరినీ కాల్చేస్తూ ఓ ఉగ్రవాది తమ వద్దకు రాగా..తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్ కోరినా పట్టించుకోకుండా కాల్చేశాడని వాపోయారు.