TG: హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. 12 రోజుల పాటు ఇది కొనసాగనుంది. ఇక్కడ మొత్తం 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉద్యాన ప్రియులు వందలాదిగా తరలివచ్చారు. ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జానపద, ఆదివాసీ కళాకారుల నృత్యాలు సందర్శకులను అమితంగా అలరించాయి. మహా భారతంలోని రాయబార ఘట్టం ఆకట్టుకుంది.