AP: వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇప్పటికే టీడీపీలో చేరారు. ఆ ముగ్గురి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించలేదు. అయితే రాయలసీమకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని టాక్. అదే విధంగా వైసీపీ మద్దతుతో ఉపాధ్యాయ కోటాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా సైకిల్ సవారీకి ఆసక్తిగా ఉన్నారట.