క్రోసూరు: నేలకు ఒరిగిన విద్యుత్ వైర్.. ప్రమాదంలో వాహనదారులు

84చూసినవారు
ఊటుకూరు నుంచి అచ్చంపేట వెళ్లే రహదారిలో విద్యుత్ వైర్లు నేలకు ఒరిగి ప్రమాదపరితంగా ఉన్నాయని స్థానిక ప్రజలు శనివారం తెలిపారు. జగనన్న కాలనీకి విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు గతంలో 3 ఫేస్ లైన్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన వైర్ నేలకు ఒరగడంతో ప్రమాదం సంభవిస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ స్పందించి నేలకు ఒరిగిన వైర్లు బిగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్