పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను బెంగాల్ లోకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనుమతిస్తున్నదని ఆరోపించారు. ఇందుకు కొంతమంది కలెక్టర్లు, ఎస్పీలు కూడా సహకారం అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరగుతున్నదని, దీని వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉన్నదని ఆరోపించారు. చొరబాట్లను తీవ్రం చేసి, తమ సర్కార్ ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు.