ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా ఈ నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.