ఐఐటీ బొంబాయిలోని పోవై క్యాంపస్‌లో ఓ పెద్ద మొసలి రోడ్డుపై కనిపించడంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోవై సరస్సు నుండి బయటకు వచ్చిన ఈ మొసలి సమీప రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. సాధారణంగా నీటిలోనే ఉండే మొసలి, గూడు కోసం స్థలం వెతుకుతూ వచ్చి ఉండొచ్చని వన్యప్రాణి సంరక్షణ నిపుణులు తెలిపారు. స్థానికులు, అధికారులు మొసలిని కాపాడి, అది స్వయంగా సరస్సులోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నారు.