బాపట్ల: యువతీపై కత్తితో దాడి
బాపట్లలో భార్గవ్ రెడ్డి అనే యువకుడు కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతూ తిరిగి తనను ప్రేమించాలని వేధించేవాడు. ఆ యువతి తిరస్కరించడంతో కక్ష గట్టిన అతను ఆదివారం అర్ధరాత్రి ఆమె ఇంటికెళ్లి ఆమెపై చాకుతో దాడి చేయగా అడ్డొచ్చిన ఆమె తల్లిదండ్రులపై కూడా దాడి చేయడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి వచ్చి ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.