ఈనెల 19నుండి డిసెంబర్19 వరకు మరుగుదొడ్లు నిర్మాణం, పరిశుభ్రతపై జిల్లాలోని అన్ని గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, రోగాల బారిన పడకుండా చూడాలని సూచించారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా జిల్లాల రెండు ఇసుక రేవులను గుర్తించామని తెలిపారు.