బాపట్ల పురపాలక సంఘ కార్యాలయం లో ఆదివారం మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డిని పౌర సమాఖ్య సంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణంలో వాడుకలో ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని వారు కోరారు. త్వరలోనే పురపాలక సంఘ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం దిశగా చర్యలు తీసుకుంటామని పౌర సమైక్య సభ్యులు సహకరించాలని కమిషనర్ కోరారు.