ఎమ్మెల్సీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని బాపట్ల జిల్లా వైసిపి దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లా రామయ్య కోరారు. మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వికలాంగులు, పట్టభద్రులు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల విభాగం సభ్యులు పాల్గొన్నారు.